calender_icon.png 5 August, 2025 | 2:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆల్ ఇండియా యూనివర్సిటీ ఫెన్సింగ్ పోటీలకు మెదక్ నుంచి ఐదుగురు క్రీడాకారులు ఎంపిక

24-10-2024 12:18:23 PM

మెదక్ జిల్లా చేగుంట, (విజయక్రాంతి): ఇటీవల కూకట్ పల్లి జేఎన్టీయూ కాలేజీ ఇండోర్ స్టేడియంలో జరిగిన యూనివర్సిటీ ఫెన్సింగ్ పోటీలలో మెదక్ జిల్లా నుండి అయిదుగురు క్రీడాకారులు ఎంపికైనారని కోచ్ కరణం గణేష్ రవికుమార్ తెలిపారు. ఎంపికైన వారిలో కరణం నిశాంత్ ఫాయిల్ విభాగంలో ఎంపికవుగా, శ్రీశాంత్ ముఖేష్ ఈపీ విభాగంలో, జవాదుద్దీన్ సాబేర్ విభాగంలో ఎంపికవ్వగా, రాజేశ్వరి ఈఫీ విభాగంలో ఎంపికైంది. 

నిశాంత్ దుందిగల్ లోని ఐఏఆర్ఈ  కాలేజీలో బిటెక్ (సిఎస్సి) థర్డ్ ఇయర్ చదువుతుండగా, శ్రీశాంత్ కొంపల్లి లోని సిఎంఆర్ సెట్ కాలేజీలో బీటెక్ (సిఎస్సి)  సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. ముఖేష్ దుందిగల్ లోని (యంయల్ఆర్ఐటి) కాలేజీలో ట్రిపుల్ ఇ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. జవదుద్దీన్ (బివిఆర్ఐటిఎన్) నర్సాపూర్ కాలేజీలో ఐటి థర్డ్ ఇయర్ చదువుతున్నాడు. రాజేశ్వరి కొంపల్లి లోని సీఎంఆర్ఈసీ కాలేజీలో బిటెక్ (ఐటీ) సెకండ్ ఇయర్ చదువుతున్నది. ఎంపికైన వీరందరూ నవంబర్ ఆరో తారీకు నుంచి పదవ తారీకు వరకు జమ్మూ లోని యూనివర్సిటీ ఆఫ్ జమ్ము ఇండోర్ స్టేడియంలో జాతీయ స్థాయి పోటీలలో పాల్గొంటారని ఆయన తెలిపారు. వీరి ఎంపిక పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు.