calender_icon.png 12 August, 2025 | 5:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గాజాలో ఐదుగురు జర్నలిస్టులు హతం

12-08-2025 01:44:52 AM

వీరిలో ఒకరు హమాస్ ఉగ్రవాది అని ఆరోపిస్తున్న ఇజ్రాయెల్

న్యూఢిల్లీ, ఆగస్టు 11: గాజా నగర సమీపంలోని అల్ షిఫా ఆస్పత్రిపై ఇజ్రాయెల్ సే నలు జరిపిన దాడిలో అంతర్జాతీయ మీడి యా సంస్థ ‘అల్ జజీరా’కు చెందిన ఐదుగు రు జర్నలిస్టులు హతం అయ్యారు. చనిపో యిన ఐదుగురు జర్నలిస్టుల్లో ఒకరు హమా స్ ఉగ్రవాది అని ఇజ్రాయెల్ సైన్యం వెల్లడించింది. అల్ కరస్పాండెంట్లు అనాస్  మహ్మద్ ఖురేషితో పాటు కెమెరామెన్లు ఇబ్రహీం, అలీవా, మహ్మద్ మరణించినట్టు ఆ సంస్థ పేర్కొంది.

ఆస్పత్రి బయట ఉన్న ప్రెస్ టెంట్‌పై ఇజ్రాయెల్ దా డి చేయగా.. ఏడుగురు ప్రాణాలు కోల్పోయారని అల్ జజీరా వెల్లడించింది. అనా స్‌ధూ ఓ ఉగ్రవాది అని, అతడు హమాస్ టెర్రరిస్ట్ సెల్‌కు హెడ్‌గా పని చేశాడని ఇజ్రాయెల్ మిలటరీ ఆరోపించింది. ఇజ్రాయెల్ పౌరులు, ఐడీఎఫ్ బలగాలపై జరిగిన రాకెట్ దాడులకు అతడే కారణమం ది. పలు పత్రాలను పరిశీలించిన తర్వాత అతడు ఉగ్రవాది అని నిర్ధారించినట్టు పే ర్కొంది.

ఈ దాడిని పాలస్తీనా జర్నలిస్టుల సంఘం తీవ్రంగా ఖండించింది. హమాస్‌ను పూర్తిగా నిర్వీర్యం చేయడం తప్ప తమకు మరో అవకాశం లేదని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు పేర్కొన్నారు. ఈ దా డులపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు సమాచారం ఇచ్చినట్టు నెతన్యాహు తెలిపారు.