12-08-2025 01:43:00 AM
-తమిళ కవి వైరముత్తు వివాదాస్పద వ్యాఖ్యలు
చెన్నై, ఆగస్టు 11: తమిళ కవి, సాహితీవేత్త వైరముత్తు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రాచీన తమిళ కవి కాంబర్ పేరుతో అంది ంచే అవార్డును స్వీకరిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి. ‘సీత ను కోల్పోయిన తర్వాత రాముడు మానసిక సమతుల్యతను కోల్పోయాడు. మానసిక స్థి తి సరిగా లేని వ్యక్తి చేసే తప్పు భారతీయ శి క్షాస్మృతిలో నేరంగా పరిగణించబడదు. ఐ పీసీ సెక్షన్ 84 కూడా అదే విషయం చెబుతోంది. కాంబర్‌కు ఐపీసీ తెలుసోలేదో తెలియదు కానీ ఆయనకు సమాజం బాగా తెలుసు’ అని అన్నారు. రామాయణ తమిళ అనువాదం అయిన ‘కాంబ రామాయణం’ కాంబర్ రచించారు.