12-08-2025 01:45:03 AM
హైదరాబాద్, ఆగస్టు 11 (విజయక్రాంతి): తెలంగాణ ప్రభుత్వం మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నట్లుగానే, ఏపీ ప్రభు త్వం కూడా స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 15 నుంచి అక్కడి మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించనున్నది. అక్కడ ప్రభుత్వం ‘స్త్రీ శక్తి’ పేరిట ఈ పథకాన్ని అమలు చేయనున్నది.
పథకం ధ్వారా మహిళలతోపాటు ట్రాన్స్‌జెండర్లు కూడా పలె ్లవెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు. తిరుమల-తిరుపతి మధ్య తిరిగే సప్తగిరి బస్సులతో పాటు నాన్ స్టాప్ బస్సులు, ఇతర రాష్ట్రాల మధ్య తిరిగే బస్సులు, ఆల్ట్రా డీలక్స్, సూపర్ లగ్జరీ, స్టార్ లైనర్, ఏసీ బస్సుల్లో ఈ పథకం వర్తించదు. మరోవైపు తెలంగాణలో మహాలక్ష్మి పథకం అమలులో భాగంగా, కొందరు కండక్టర్లు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొందరు మహిళలు వారితో వాగ్వాదాలు దిగిన ఘటనలు అనేకం ఉన్నాయి.