calender_icon.png 23 December, 2025 | 4:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టైటిల్ ఫిక్స్

20-10-2024 12:00:00 AM

బాలీవుడ్ ప్రముఖ నటుడు సన్నీ డియోల్ యాక్షన్ హీరోగా నాలుగు దశాబ్దాల తన సక్సెస్ ఫుల్ కెరీర్‌లో 100 మైల్ స్టోన్ మూవీకి చేరువ య్యారు. తాజాగా గద్దర్ 2తో అలరించిన సన్నీ డియోల్, డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో కలిసి ఓ సినిమా చేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మాతలు నవీన్ యెర్నేని, వై రవిశంకర్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాత టిజి విశ్వప్రసాద్‌తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శనివారం సన్నీడియో ల్ పుట్టిన రోజు కావడంతో ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ పోస్టర్, ఫస్ట్ లుక్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ చిత్రానికి ‘జాత్’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఫస్ట్ లుక్ పోస్టర్‌లో సన్నీ డియోల్ శరీరమంతా రక్తపు మరకలతో మ్యాసీవ్ ఫ్యాన్ పట్టుకుని కనిపిస్తున్నారు. ‘జాత్’ చిత్రంలో రణదీప్ హుడా, వినీత్ కుమార్ సింగ్, సయామి ఖేర్, రెజీనా కసాండ్రా తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది.