26-01-2026 07:37:34 PM
కోదాడ: పట్టణంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్, కాంగ్రెస్ పార్టీ కార్యాలయం, మహిళా మండలి, వ్యవసాయ మార్కెట్ కమిటీ, గ్రంథాలయం, మండల సమాఖ్య కార్యాలయం, మున్సిపాలిటీ ఎమ్మార్వో ఆర్డీవో మండల పరిషత్ కార్యాలయాల్లో జరిగిన గణతంత్ర వేడుకల్లో ఎమ్మెల్యే పద్మావతి పాల్గొన్నారు. ప్రభుత్వ ఆఫీసులు, ప్రైవేట్ ఆఫీసులు, పలు కార్మిక సంఘాల ఆఫీసుల్లో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిపారు. ఆయా వేడుకల్లో మార్కెట్ కమిటీ చైర్మన్ తిరపతమ్మ సుధీర్, వైస్ చైర్మన్ బషీర్, ఆర్డీఓ సూర్యనారాయణ, తహసీల్దార్ వాజిద్ అలీ, కమిషనర్ రమాదేవి, వెంకన్న పాల్గొన్నారు.