calender_icon.png 7 November, 2025 | 1:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సబ్సిడీపై పనిముట్లను సద్వినియోగం చేసుకోవాలి

06-11-2025 10:58:45 PM

ఆత్మ కమిటీ చైర్మన్ కొండం రవీందర్ రెడ్డి..

ములుగు (విజయక్రాంతి): సబ్సిడీ వ్యవసాయ పనిముట్లు రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆత్మ కమిటీ చైర్మన్ కొండం రవీందర్ రెడ్డి సూచించారు. ఈ మేరకు గురువారం ములుగు జిల్లా కేంద్రంలోని రైతు వేదికలో ఆత్మ కమిటీ సమావేశం నిర్వహించారు. దీనికి ముఖ్యఅతిథిగా కొండం రవీందర్ రెడ్డి హాజరై మాట్లాడుతూ రైతులకు ఉపయోగపడే రోటీవేటర్, కల్టివేటర్, బ్యాటరీ పంపులు అందుబాటులో ఉన్నాయని, సబ్సిడీపై వ్యవసాయ పనిముట్లు అందించడం జరుగుతుందని అన్నారు. దీనిని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

మత్సశాఖకు సంబంధించి ఉచిత చేప పిల్లల పంపిణీని అట్టహాసంగా ప్రారంభించడం జరిగిందని అన్నారు. రైతులు పండించిన పంటలను దళారులకు విక్రయించకుండా ప్రభుత్వం ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రంలోనే విక్రయించాలని అన్నారు.సన్న వడ్లకు రాష్ట్ర ప్రభుత్వం క్వింటాకు రూ.500 బోనస్ ఇస్తుందని దీనిని రైతులు ఉపయోగించుకోవాలని అన్నారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి సురేష్ కుమార్, ఉద్యానవన శాఖ అధికారి సంజీవరావు, పశువైద్యాధికారి రమేష్, వ్యవసాయ శాఖ అధికారి శ్రీధర్, ఆత్మ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.