22-09-2025 12:18:14 AM
దమ్ముంటే ఎంపీ నిధులతో వరద కాలువను పునరుద్ధరించండి
బూరుగుపల్లి మాజీ సర్పంచ్ విజయ వర్ధన్ రెడ్డి
గజ్వేల్, సెప్టెంబర్ 21: గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ భాస్కర్ అవినీతి వ ల్లే ప్రజ్ఞాపూర్ లో వరద నీటి కష్టాలు కొనసాగుతున్నాయని, రాజకీయ లబ్ధి కోసం వంటేరు ప్రతాపరెడ్డిని విమర్శిస్తే సహించేది లేదని బూరుగుపల్లి మాజీ సర్పంచ్ విజయవర్ధన్ రెడ్డి అన్నారు. ప్రజ్ఞాపూర్ ఊర చెరువు వరదకు ప్రతాప్ రెడ్డి వెంచరే కారణమంటూ బిజెపి నాయకులు చేసిన ఆరోపణలను విజయవర్ధన్ రెడ్డి ఆదివారం విలేకరుల సమావేశంలో ఖండించారు.
ప్రతాప్ రెడ్డి వెంచర్ స్థ లాలకు గతంలోనే కోర్టు క్లీన్ చీటీ ఇచ్చింద ని, ప్రజ్ఞాపూర్ ఊర చెరువు కాలువల పేరి ట తమ కుటుంబాన్ని వివాదంలోకి లాగుతే బిజెపి నేతలపై పరువు నష్టం దావా వేస్తామ ని విజయవర్ధన్ రెడ్డి హెచ్చరించారు. ఊర చెరువు మత్తడి నీళ్లకు వెంచర్ కు కిలోమీటర్ దూరం ఉందని, మత్తడి నీళ్లు వెళ్లే మార్గం పా ర్టీవేశ్వర నగర్ లో ఉండేది కానీ అప్పుడు న్న మున్సిపల్ చైర్మన్ గాడిపల్లి భాస్కర్ అవినీతి మత్తులో జోగుతూ భాస్కర్ తన హ యాంలో అభివృద్ధిని గాలికి వదిలేసి అవినీతికి, అక్రమాలకు పాల్పడడంతో కల్వర్టులు మూసుకుపోయాయన్నారు.
ఆనాటి మున్సిపల్ చైర్మన్ భాస్కర్ ఘనత వల్లే ఈరోజు ప్ర జ్ఞాపూర్ ఊర చెరువు నీళ్లు రోడ్లపైకి వస్తున్నాయన్నారు. దమ్ముంటే పార్టీవేశ్వర నగర్, ప్రజ్ఞాపూర్ మత్తడి కల్వర్టు పనులకు ఎంపీ గారి నిధుల తీసుకువచ్చి కల్వర్టు పనులను పునరుద్ధరించి సమస్యను పరిష్కరించాలని బిజెపి నాయకులకు సవాల్ విసిరారు. గతం లో కెసిఆర్ ప్రభుత్వం కల్వర్టు పనులకు రూ. 14 కోట్లు మంజూరు చేస్తే ప్రస్తుతమున్న ప్ర భుత్వం రద్దు చేసిందన్నారు.
మున్సిపల్ చై ర్మన్ గా ఉన్నప్పుడు మీరు చేసిన తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికి, మున్సిపల్ మా జీ చైర్మన్ భాస్కర్ హయాంలోనే 216 ప్లా ట్లకు చట్టపరంగా అనుమతులు వచ్చాయని, అది తెలిసి కూడా మీరు సోయి లేకుండా మాట్లాడటం చాలా సిగ్గుచేటన్నారు. గత ఎ న్నికలలో ప్రజలు డిపాజిట్ రానివ్వలేదని, బిఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలో గెంటేసినా వక్రబుద్ధి మారలేదని బిజెపిలో చేరి రాజకీ యంగా లబ్ధి పొందాలనుకోవడం సిగ్గుచేటన్నారు.
ఇప్పటికైనా నిజనిజాలు తెలుసుకొని మాట్లాడాలని, లేనిపక్షంలో ఆరోపణలు చే స్తున్న వారిపై చట్టారీత్యా కేసులు వేసి పరు వు నష్టం దావా వేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బిఆర్‌ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు బెండ మధు, గజ్వేల్ పట్టణ అధ్యక్షుడు నవాజ్ మీరా, కౌన్సిలర్ కనకయ్య, నా యకులు అహ్మద్, బిక్షపతి, వెంకటేశం, మ ల్లేశం, సాయి, సురేష్, యూత్ అధ్యక్షుడు స్వామి చారి తదితరులున్నారు.