calender_icon.png 22 September, 2025 | 6:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అన్నదానంతో ఆకలి తీర్చడం అభినందనీయం

22-09-2025 12:18:35 AM

సూర్యాపేట, సెప్టెంబర్ 21 (విజయక్రాంతి) :  అన్నదానంతో ఆకలి తీర్చడం అభినందనీయమని సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి అన్నారు. ఆదివారం మహాలయ పక్ష అమావాస్య పర్వదినాన్ని పురస్కరించుకొని పట్టణంలోని రిలయన్స్ ట్రెండ్స్ ఎదురుగా సుమన్ యువసేన ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. స్నేహితులంతా కలిసి అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం హర్షనీయం అన్నారు.

మహాలయ పక్ష అమావాస్య రోజున చేసే అన్నదానం చాలా ప్రాముఖ్యత కలిగి ఉంటుందన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు అంజద్ అలీ, మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కక్కిరేణి శ్రీనివాస్, దండు మైసమ్మ దేవస్థానం చైర్మన్ తంగేళ్ల కరుణాకర్ రెడ్డి, బ్రహ్మండ్లపల్లి మురళీధర్,ఈగ దయాకర్, నరేంద్రుని విద్యాసాగర్, బెలిదే అంజయ్య, గోరెంట్ల సంపత్,పబ్బా ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.