13-08-2025 01:07:08 AM
జీహెచ్‌ఎంసీ కమిషనర్ కర్ణన్
హైదరాబాద్ సిటీ బ్యూరో/మలక్‌పేట, ఆగస్టు 12 (విజయక్రాంతి): నల్లగొండ ఎక్స్‌రోడ్ నుంచి ఓవైసీ జంక్షన్ వరకు నిర్మిస్తున్న స్టీల్ ఫ్లైఓవర్ పనుల్లో వేగం పెంచి త్వరగా ప్రజలకు అదుబాటులోకి తీసుకురావాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్‌వి కర్ణన్ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. మంగళ వారం ఉదయం కమిషనర్ ఆర్‌వి కర్ణన్ మలక్పేట్ ఎమ్మెల్యే అహ్మద్ బిన్ అబ్దుల్లా బాలాలా, చార్మినార్ జోనల్ కమిషనర్ వెం కన్నలతో కలిసి నిర్మాణంలో ఉన్న 2.58 కి లోమీటర్ల నాలుగు లైన్ల బై డైరెక్షనల్ ఫ్లైఓవర్‌ణు పరిశీలించారు.
ఈ ఫ్లైఓవర్ రూ.620 కోట్లతో నిర్మిస్తున్నారు. పరిశీలన సందర్భంగా కమిషనర్ పనులను నాణ్యతతో పా టు వేగంగా పూర్తి చేయాలని సూచించారు. ప్రాజెక్ట్ ఇంజనీర్లు 2026 మార్చిలోగా పనులు పూర్తి చేస్తామని తెలిపారు. అనంతరం కమిషనర్ మలక్పేట్ ఆర్‌యూబి వద్ద వరద నీటి నిల్వ సమస్యను పరిశీలించారు. దీనికి ప్రత్యామ్నాయ డ్రైనేజ్ మార్గాలను పరిశీలించి ప్రతిపాదనలు ఇవ్వాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. అనం తరం కమి షనర్ దబీర్‌పురా ప్రాంతంలోని నాలాలను పరిశీలించారు. కమిషనర్ వెంట మలక్‌పేట డిప్యూటీ కమిషనర్ ఎంకెఐ అలీ, మెయింటెనెన్స్ ఈఈ పీర్సింగ్, ప్రాజెక్ట్ ఈఈ గోపాల్ తదితరులు ఉన్నారు.