calender_icon.png 2 January, 2026 | 3:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అసెంబ్లీ తర్వాత ఉద్యోగుల సమస్యలపై దృష్టి

02-01-2026 01:47:11 AM

ఉద్యోగ సంఘాల నేతలకు సీఎం రేవంత్‌రెడ్డి హామీ 

హైదరాబాద్, జనవరి 1 (విజయక్రాంతి): అసెంబ్లీ సమావేశాల అనంతరం ఉద్యోగుల సమస్యలపై దృష్టి పెడుతానని సీఎం రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారని తెలంగాణ ఎంప్లాయీ స్ జేఏసీ చైర్మన్ మారం శ్రీనివాస్, సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావులు తెలిపారు. నూతన సంవత్సరం సందర్భంగా ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలు సీఎం రేవంత్‌రెడ్డిని గురువారం కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా ఉద్యోగుల అపరిష్కృత సమస్యలను సీఎం దృష్టికి తీసుకె ళ్లగా సీఎం సానుకూలంగా స్పందించారని తెలిపారు. సీఎంను కలిసిన వారిలో ముజీబ్ హుస్సేన్, సత్యనారాయణ, మధుసూదన్‌రెడ్డి, బీ శ్యామ్, అనిల్‌కుమార్, వెంకటేశ్వర్లు, తిరుపతియాదవ్ తదితరులు ఉన్నారు. 

ఆర్‌యూపీపీటీఎస్ ఢైరీ ఆవిష్కరణ 

రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్ తెలంగాణ రాష్ట్రం నూతన సంవత్సరం డైరీని డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీ న్ నికోలస్ గురువారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు చింతకుం టు జగదీష్, ములుకునూరి శంకర్, దార్ల రాఘవేంద్రాచారి, రాములు, కొయ్యడ వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.