calender_icon.png 2 January, 2026 | 1:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముందుంది మున్సిపల్ పోరు

02-01-2026 12:16:30 AM

మూడు పార్టీలకు ప్రతిష్టాత్మకం

ప్రజాపాలన ప్రభుత్వంలో మొదటి మున్సిపల్ ఎన్నికలు 

ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వ చర్యలు వేగవంతం

రిజర్వేషన్లు పదవులపై తీవ్రచర్చ

ఓటర్ల ముసాయిదా డ్రాఫ్ట్ విడుదల

నిర్మల్, జనవరి 1 (విజయక్రాంతి): స్థానిక సంస్థల ఎన్నికల ఘట్టంలో ఘట్టంలో భాగం గా గ్రామపంచాయతీ ఎన్నికల పక్రియ ముగియగా ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలపై జోరు గా చర్చ సాగుతోంది. తెలంగాణలో అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయ కత్వంలో ప్రజాపాలన ప్రభుత్వం అధికారుల కు వచ్చి రెండేళ్లు పూర్తయిన నేపథ్యంలో ఎన్నికలు వీలైనంత త్వరగా నిర్వహించాలని ప్రభు త్వం  చర్యలు వేగవంతం చేసింది. సర్పంచ్ ఎన్నికల్లో రాష్ట్రంలో మెజార్టీ స్థానాలు కాంగ్రెస్ పార్టీ మద్దతు దారులు దక్కించుకోవడంతో మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ గుర్తుల ఆధారంగా ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఎన్నికలను వచ్చే ఫిబ్రవరిలో నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తుంది. నిర్మల్ జిల్లాలో నిర్మల్ బైంసా ఖానాపూర్ మున్సిపాలిటీలు ఉండగా నిర్మల్ లో 42 వార్డులు, భైంసా 26 వార్డులు, ఖానాపూర్‌లో 12 వార్డులు ఉన్నాయి.

అన్ని మున్సి పాలిటీలో ఇప్పటికి ఓటర్ల జాబితా వార్డుల విభజన, వారి ఓటర్ల జాబితా అభ్యంతరాల సేకరణ పోలీస్ స్టేషన్ల ఏర్పాటు తుది ఓటర్ల జాబితా పై జిల్లా అధికారులు కసరత్తు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా మున్సిపల్ ఎన్నికల నిర్వహణ సంబంధించిన ప్రక్రియపై వేగంగా కసరత్తులు పూర్తి చేయాలని ఆయా మున్సిపాలిటీలకు ఆదేశాలు జారిచేయడంతో నిర్మల్ జిల్లాలో ఈనెల 10న తుది ఓటర్ల ముసాయిదా జాబితాలు ఫైనల్ చేసేందుకు జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకుంటుంది ఇప్పటికే జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అడిషనల్ కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ ఆయా మున్సి పల్ కమిషనర్లతో ఓటర్ల జాబితా రాజకీయ పార్టీల నేతలతో సమావేశం పోలింగ్ కేంద్రాల ఏర్పాటు అభ్యంతరాలు రైతుల అంశాలపై సమావేశాలు నిర్వహించి తుది జాబితా తయారు చేసే పనిలో నిమగ్నమయ్యారు

పార్టీలకు ప్రతిష్టాత్మకం

నిర్మల్ జిల్లాలో త్వరలో జరిగే మున్సిపల్ ఎన్నికలు నాలుగు పార్టీలకు ప్రతిష్టాత్మక కానున్నాయి. రాష్ట్రంలో అధికారులు ఉన్న కాంగ్రెస్ పార్టీతో పాటు ప్రతిపక్ష పార్టీలైన బీఆర్‌ఎస్ బీజేపీ ఎంఐఎం పార్టీలు ఈ జిల్లాలో ప్రభా వం ఉండడంతో నాలుగు పార్టీలకు ఎన్నికలు సవాల్గా నిలబడి ఉన్నాయి. అయితే ప్రభుత్వం రిజర్వేషన్ల ప్రక్రియ అధికారికంగా ప్రకటించిన తర్వాతనే ఆయా మున్సిపాలిటీలో బలమైన అభ్యర్థులను మున్సిపల్ చైర్మన్గా వార్డు వాడు కౌన్సిలర్గా నిలబెట్టినందుకు క్షేత్రస్థాయిలో స్థానిక లీడర్లు కసరత్తు చేస్తున్నారు.

నిర్మల్ జిల్లాలో స్థానిక రాజకీయ పరిస్థితులు విభిన్నంగా ఉండడంతో పార్టీల నేతలకు ఈ ఎన్నిక లు సవాల్‌గా నిలవనున్నాయి. నిర్మల్ జిల్లాలో ముధోల్, నిర్మల్, ఖానాపూర్ అసెం బ్లీ స్థానాలు ఉండగా ఖానాపూర్‌లో అధికార పార్టీ ఎమ్మెల్యే వెడుమ బుజ్జు పటేల్, నిర్మల్ ముధోల్‌లో బిజెపి నేత మహేశ్వర్‌రెడ్డి, సీనియర్ నేత రామారావు పటేల్ ఎమ్మెల్యేలుగా ప్రాతినిథ్యం వహిస్తున్నారు కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతలైన వేణుగోపాలచారి, మాజీ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, రేఖా శ్యాంనాయక్, విట్టల్‌రెడ్డి, నారాయణరావు పటేల్ ఉండడం తో అధికారం చేజికిచ్చుకునేలా ఆ పార్టీ కసరత్తు చేస్తోంది ముథోల్‌లో కాంగ్రెస్ బీఆర్‌ఎస్ మధ్య పోటీ నెలకొనగా బీఆర్‌ఎస్ నియోజకవర్గ ఇన్చార్జ్ జాన్సన్ నాయకత్వంలో బీఆర్‌ఎస్ జండా ఎగరవేయాలని చూస్తున్నారు.

ఇక నిర్మల్ ముధోల్‌లో బీఆర్‌ఎస్ ప్రభా వం అంతగా ఉండదని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇక ఎంఐఎం విషయానికొస్తే జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్న జాబీ ర్ అహ్మద్ నిర్మల్‌లో అజీమ్ బిన్ అయ్యా ఆదోనిలో ఎంఐఎం మున్సిపల్ బరిలో దిగనుంది గతంలో పైసా మున్సిపాలిటీ కైవసం చేసుకోగా నిర్మల్‌లో 8 స్థానాలు ఆ పార్టీకి దక్కాయి ఈసారి కూడా మెజార్టీ స్థానాలు దక్కించుకొని మున్సిపల్‌లో ఎంఐఎం రాజకీయ ప్రాధాన్యత మరింత పెంచుకునే విధంగా ఆ పార్టీ నేతలు దృష్టి పెట్టారు.

రిజర్వేషన్లు తీవ్ర చర్చ

నిర్మల్ జిల్లాలో జరిగిన మూడు మున్సిపల్ ఎన్నికల్లో ఓటర్ల ముసాయిదా జాబితా అనంతరం ప్రభుత్వం చైర్మన్ వాడు కౌన్సిలర్ల రిజర్వేషన్ అధికారికంగా ప్రకటించనున్నారు. ఏ మున్సిపాలిటీకి ఏ రిజర్వేషన్ వర్తిస్తుందో ఆశతో ఎదురుచూస్తున్న ప్రజాప్రతినిధులు ఎక్కడ ఏ రిజర్వేషన్ అమలయితే అక్కడ ఏ అభ్యర్థిని నిలబెట్టాలో కులాల సామాజిక వర్గా ల ఆధారంగా అన్ని పార్టీల నేతలు దృష్టి పెట్టా రు. గత ఎన్నికల్లో రిజర్వేషన్లు మారుస్తూ కొత్త రిజర్వేషన్లు రానున్నాయి ఒకటి జనరల్‌కు ఒకటి బీసీకి ఒకటికి మహిళకు దక్కి అవకాశం ఉండడంతో ఆశపడ్డ ముఖ్య నేతలు నియోజకవర్గ నేతలతో తమ అభ్యర్థులపై సంప్రదిం పులు జరుపుతూనే రాష్ట్రస్థాయి నేతలను కలిసి తమకు మద్దతు ఇవ్వాలని లాబీయింగ్ నిర్వహిస్తున్నారు.

కాంగ్రెస్‌లో పోటీ తీవ్రంగా బిజెపిలో బీఆర్‌ఎస్‌లో కూడా పోటీ ఉన్నట్టు ప్రచా రం జరుగుతుంది. అయితే ఇప్పటి ఇప్పటికిప్పుడే అభ్యర్థిత్వాల ఎంపికపై ఏం మాట్లాడ కుండా అన్ని పార్టీల అగ్రనేతను సమన్వయం పాటించాలని సూచిస్తున్నారు. ఒక పార్టీలో టికెట్ రాకపోతే మరో పార్టీ ద్వారా అదృష్టాన్ని పంచుకునేందుకు ముఖ్య నేతలు ఆయా పార్టీ నేతలతో తెర వెనుక రాజకీయాలు చేస్తున్నారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.