calender_icon.png 2 January, 2026 | 5:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విశ్వవ్యాప్తం.. మన నుమాయిష్

02-01-2026 01:46:18 AM

నగరాన్ని మోస్ట్‌సేఫ్ సిటీగా మారుస్తున్నాం

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

హైదరాబాద్ ఎమోషనల్ అడ్రస్‌గా ఎగ్జిబిషన్

ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబు

నాంపల్లి ఎగ్జిబిషన్‌లో గ్రౌండ్‌లో 

ప్రారంభమైన 85వ ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్

హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 1 (విజయక్రాంతి): ప్రపంచీకరణ నేపథ్యంలో ప్రపంచమే ఒక కుగ్రామంగా మారిన తరు ణంలో.. హైదరాబాద్ కీర్తికిరీటమైన ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ నుమా యిష్ సొసైటీ ప్రపంచ స్థాయికి ఎదగాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆకాం క్షించారు. గ్లోబల్ సిటీగా ఎదుగుతున్న హైద రాబాద్‌ను దేశంలోనే అత్యంత సేఫ్ సిటీగా, కాలుష్యరహిత నగరంగా తీర్చిది ద్దేందుకు ప్రజా ప్రభుత్వం కంకణం కట్టుకుందని స్పష్టం చేశారు. గురువారం సాయం త్రం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో 85వ అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శనను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సొసైటీ అధ్యక్షుడు, మంత్రి శ్రీధర్‌బాబుతో కలిసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. ఉస్మానియా గ్రాడ్యుయేట్లు 1938లో పబ్లిక్ గార్డెన్స్‌లో నాటిన చిన్న మొక్క.. నేడు మహా వృక్షమై దేశంలోని భిన్న సంస్కృతుల సమ్మేళనానికి వేదికగా మారిందని కొనియా డారు. ఇది కేవలం వ్యాపార కేంద్రం కాదని, దేశ నలుమూలల నుంచి వచ్చే కళాకారులు, చేతివృత్తుల వారి నైపుణ్యానికి నిలువుటద్ద మన్నారు. సొసైటీ ద్వారా వచ్చే ఆదాయం తో 19 విద్యాసంస్థలను నడుపుతూ, పేద విద్యార్థులకు, మహిళలకు సాధికారత కల్పి స్తుండటం అభినందనీయమన్నారు.

గత పాలకులు సొసైటీని పట్టించుకోలేదని, కానీ సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని తమ ప్రభు త్వం సొసైటీ విస్తరణకు, వారి ఆలోచనలను సాకారం చేయడానికి పూర్తి సహకారం అందిస్తుందని భట్టి హామీ ఇచ్చారు. ఢిల్లీలో వాయు కాలుష్యం వల్ల కనీసం వారం రోజులు కూడా ఉండలేని పరిస్థితి ఉందని, అలాంటి దుస్థితి హైదరాబాద్‌కు రావొద్దని ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే మూసీ నది పునరుజ్జీవానికి వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని, లండన్ థేమ్స్ నది తరహాలో అభివృద్ధి చేస్తామన్నారు. నగరంలోని డీజిల్ బస్సులను తొలగించి ఎలక్ట్రిక్ బస్సులను తెస్తున్నామని, కాలుష్య కారక పరిశ్రమలను ఓఆర్‌ఆర్ ఆవలకి తరలించే యోచనలో ఉన్నట్లు తెలిపారు. హైదరాబాద్ను రాక్స్, లేక్స్, పార్కులతో కూడిన ప్లాస్టిక్ రహిత నగరంగా భవిష్యత్ తరాలకు అందిస్తామని హామీ ఇచ్చారు.

ఆన్‌లైన్‌లో కొంటే మనిషి కనిపించడు..

ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్షుడు, మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. నుమాయిష్‌ను ఒక సోషల్ స్టార్టప్‌గా అభివర్ణించారు. ‘నేడు మనం ఆన్‌లైన్‌లో ఆర్డర్ ఇస్తే వస్తువు మాత్ర మే ఇంటికి వస్తుంది. కానీ నుమాయి ష్‌లో వస్తువుతో పాటు దాన్ని తయారు చేసిన మనిషి కనిపిస్తాడు. ఈ హ్యూమన్ కనెక్షన్ ఏ టెక్నాలజీ ఇవ్వలేదు’ అని వ్యాఖ్యానించారు. నుమాయిష్ అనేది హైదరాబాద్ నగరానికి ఒక ఎమోషనల్ అడ్రస్ అని, పదేళ్లకోసారి పాతబడే ఇతర ఎగ్జిబిషన్లలా కాకుండా.. ఇది ఏటా తనను తాను కొత్తగా ఆవిష్కరించుకుంటోందని పేర్కొన్నారు.

వచ్చే ఏడాది నుంచి నుమాయిష్ నిర్వ హణలో అత్యా ధునిక సాంకేతికతను వాడ బోతున్న ట్లు మంత్రి శ్రీధర్‌బాబు ప్రకటిం చారు. సందర్శ కుల భద్రత, సౌకర్యాల కోసం ఆర్టిఫి షియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను ఏర్పాటు చేయబోతున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో హైదరాబాద్ ఇన్‌చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్, ఎగ్జిబిషన్ సొసైటీ సభ్యులు పాల్గొన్నారు.