calender_icon.png 2 January, 2026 | 3:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఒకే రోజు తండ్రీకొడుకు మృతి

02-01-2026 01:49:14 AM

నూతన సంవత్సరం రోజే నాగేపల్లిలో విషాదం

మంథని/రామగిరి, జనవరి 1(విజయక్రాంతి): నూతన సంవత్సరం రోజున పెద్ద పల్లి జిల్లా రామగిరి మండలం నాగేపల్లి గ్రామంలో విషాద ఘటన చోటు చేసుకుం ది. ఒకే రోజు తండ్రి, కొడుకు మృతి చెందడంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు నెల కొన్నాయి. కుటుంబ సభ్యులు, గ్రామస్తుల కథనం ప్రకారం గ్రామానికి చెందిన ఎరుకల రాజేశం (56) కొన్ని నెలలుగా పక్షవాతానికి గురై మంచానికే పరిమితమయ్యాడు. కు టుంబ సభ్యుల సంరక్షణలో ఇంటివద్దే చికిత్స పొందుతూ గురువారం రాజేశం మృతి చెందాడు. దీంతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో ఉండగానే ఆ కుటుంబాన్ని మరో పెద్ద విషాదం వెంటాడింది.

రాజేశం రెండో కుమారుడు ఎరుకుల శ్రీకాంత్ (37) బుధవారం రాత్రి ఛాతీలో తీవ్రమైన నొప్పి తో అస్వస్థతకు గురయ్యాడు. కుటుంబ సభ్యులు వెంటనే అతడిని గోదావరిఖని ప్రభుత్వ దవాఖానకు తరలించారు.చికిత్స పొందుతున్న శ్రీకాంత్ పరిస్థితి విషమించడంతో తెల్లవారుజామున మృతి చెందాడు. శ్రీకాంత్‌కు భార్యతో పాటు ఇద్దరు పిల్లలు ఉన్నారు. తండ్రి మృతిని తేరుకునేలోపే కొడుకు మరణవార్త కుటుంబాన్ని పూర్తిగా కుంగదీసింది. నూతన సంవత్సరం రోజున ఈ ఘటనతో నాగేపల్లి తీవ్రవిషాదంలో మునిగిపోయింది. ఇరువురి మరణంతో పలువురు కన్నీరు మున్నీరయ్యారు.