09-09-2025 12:00:00 AM
ప్రజల ఆరోగ్యాలు ఏమైనా పర్వాలేదా?
తీర తాగాక తేదీ చూసిన కొనుగోలు దారుడు
సమాచారాన్ని సేకరిస్తున్నాం : విప్లవ రెడ్డి, ఎక్సైజ్ శాఖ సీఐ, జడ్చర్ల
జడ్చర్ల సెప్టెంబర్ 8: తినుబండారులతోపాటు వివిధ పానీయాలను సైతం గడువు దాటకముందే తీసుకోవాలని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ నిబంధనలను తూచ తప్పకుండా అమలు చేసేందుకు ప్రత్యేక అధికార యంత్రంగంను ప్రభుత్వం ఏర్పాటు చేసిం ది. గడువు దాటిన తినుబండారులైన తాగే పానీయాలైన వినియోదారుడికి విక్రయించినట్లయితే అది నేరంగానే పరిగణిస్తారు.
ఏ దో ఒక కిరాణా కొట్టులో చిన్న బిస్కెట్ ప్యా కెట్ కు గడువు దాటింది అంటే ఏదో చూసుకోలేదేమో అనుకోవచ్చు. కాగా రోజు రికార్డు స్థాయిలో మద్యం విక్రయం జరుగుతున్న ఆ మద్యంకు సంబంధించి కరోనా బీర్ ను జ డ్చర్లలోని వెంకటేశ్వర వైన్స్ నిర్వాహకులు యదేచ్చంగా గడువు దాటిన బీరును వినియోగదారుడికి విక్రయించారు. సంతోషంగా తాగుదామనుకున్న వినియోగదారుడికి సగం తాగిన తర్వాత తేదీని గమ నించి చూడగా గడువు దాటి ఎనిమిది నెల లు గడిచినట్లు గుర్తించారు. ఇదేంటని ప్రశ్ని స్తే వైన్స్ నిర్వాహకులు సైతం సమాధానాన్ని దాటే వేసినట్లు ఆ యువకుడు పేర్కొంటున్నారు..
- అస్వస్థకు గురైన యువకుడు..
జడ్చర్ల పట్టణంలోని వెంకటేశ్వర వైన్స్ లో కరోనా ఎక్స్ట్రా మినీ బీరు కొనుగోలు చే శాడు పట్టణానికి చెందిన ఓ వ్యక్తి. తీరా సగం బాటిల్ బీరు తాగాక వాంతులు కావడంతో మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పైరీ తేదీ చూసి ఒక్కసారి అవాక్కయ్యాడు. సుమారు 8 నెలల కిందట ఎక్స్పైరీ ముగిసిన బీరు అని గుర్తించి ఆందోళనకు గురయ్యాడు. సదరు వ్యక్తి కొ నుగోలు చేసిన బీర్లు మ్యానుఫ్యాక్చరింగ్ తేదీ జూన్ 18, 2024 ఉండగా, యుజ్డ్ బై (ఎక్స్పైరీ) డిసెంబర్ 17 , 2024 ఉన్నది.
ఎక్స్పైరీ తేదీ ముగిసి కూడా ఎనిమిది నెలలు గడిసిపోయింది.. ఇప్పుడు ఆ బీర్లు ఎక్కడ ఎలా ప్రత్యక్షం అయ్యాయి అని అసలు ప్రశ్న. ఏదై నా బీర్ సుమారు 6 నెలల గడుపుతో త యారుచేస్తారు. సదరు వ్యక్తి కొనుగోలు చేసి న కరోనా బీర్ గత ఏడాది డిసెంబర్ లోనే దాని గడువు తేదీ ముగిసింది. ఎనిమిది నెల ల తర్వాత బీరు విక్రయించడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కనీస ని బంధనలు పాటించకుండా, ఇష్టనుసారంగా వ్యవహరిస్తున్న వైన్స్ నిర్వహకులపై చర్యలు తీసుకోవాలని మద్యం కొనుగోలుదారులు కోరుతున్నారు.
- తనిఖీలు అవసరం...
మద్యం విక్రమ్ ఎక్కువగా జరగాలని సం బంధిత శాఖ అధికారులు నిత్యం ప్రయత్నా లు చేస్తున్నప్పటికీ తనిఖీలు కూడా చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. కేవలం విక్ర మ్ పైనే ధ్యాసే ఉంచి తనిఖీలు చేపట్టకపోతే ఏదైనా తప్పిదాలు జరిగి కొనుగోలు చేసి తీ సుకున్న ప్రజల ప్రాణాలకు ఏమైనా జరిగితే బాధ్యత ఎవరు వహిస్తారని ప్రశ్నలు వెళ్ళు వెతుతున్నాయి.
ఎక్సైజ్ శాఖ అధికారులు ప క్కా ప్రణాళికలతో నియమ నిబంధనలను అమలు చేస్తూ విక్రయాలు చేయించాల్సిన బాధ్యత ఉండి ఇలా నిర్లక్ష్యం వహించడం వె నుక ఉన్న కారణాలు ఏంటని మద్యం ప్రి యులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
సమాచారం అందింది ఎంక్వైరీ చేస్తున్నాం...
గడువు దాటిన బీరు విక్రయించిన ట్లు తమ నోటీస్ కు వచ్చింది. వెంకటేశ్వర వైన్స్ నిర్వాహకులు గత మూడు నెలలలో కొనుగోలు చేసిన మద్యం డా టా సేకరించామని అందులో కరోనా బీరు కొనుగోలు చేసినట్లు లేదు. అంత కు ముందు ఏమైనా కొనుగోలు చేశారా ? అనే విషయం పై పూర్తి సమాచారం తీసుకుంటున్నాం. అసలు ఆ పేర్లు ఎక్కడి నుంచి వచ్చాయి కొనుగోలు చే యడం జరిగిందా? లేదా? అన్ని కోణా ల్లో విచారణ చేస్తున్నాం.
సీఐ విప్లవ రెడ్డి, జడ్చర్ల ఎక్సైజ్ శాఖ, మహబూబ్ నగర్ జిల్లా