calender_icon.png 9 January, 2026 | 9:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రహదారి నిబంధనలు పాటించాలి: కలెక్టర్

07-01-2026 12:11:08 AM

మందమర్రి (బెల్లంపల్లి), జనవరి 6 : రహదారి భద్రత నిబంధనలను ప్రతి ఒక్కరు తప్పనిసరిగా పాటించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మంగళవారం మందమర్రి మండలంలో గల టోల్ ప్లాజా వద్ద 37 వ జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలు - 2026 పురస్కరించుకొని నిర్వహించిన కార్యక్రమంలో బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్, జాతీయ రహదారుల సంస్థ జిఎం(టి) పీడీ కేఎన్ అజయ్ మణికుమార్ లతో కలిసి వాహనదారులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు.

రహదారి భద్రత నిబంధనలను ప్రతి ఒక్కరు పాటించాలని, జాతీయ రహదారుల సిబ్బంది రహదారి నియమ, నిబంధనలను పాటించేలా వాహనదారులకు అవగాహన కల్పించాలని, రహదారులపై పని చేసే సిబ్బంది సైతం పని చేసే సమయంలో సేఫ్టీ కిట్స్ ధరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.