calender_icon.png 10 January, 2026 | 9:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేజీబీవీలో మౌలిక సదుపాయాలను పరిశీలించిన అధికారులు

09-01-2026 08:43:45 PM

గరిడేపల్లి,(విజయక్రాంతి): మండల కేంద్రమైన గరిడేపల్లిలోని కస్తూర్బా పాఠశాలను శుక్రవారం ఎంపీడీవో సరోజ, మండల విద్యాధికారి చత్రునాయక్ గరిడేపల్లి సర్పంచ్ మేకపోతుల వెంకటమ్మతో కలిసి పాఠశాలలోని విద్యార్థులకు అందుతున్న కనీస వసతులను వారు పరిశీలించారు.

విద్యార్థులకు అందిస్తున్న భోజనం సదుపాయాలను, టాయిలెట్స్ ను వారు ప్రత్యేకంగా పరిశీలించారు. కస్తూర్బా పాఠశాల ప్రిన్సిపల్ శైలజ మాట్లాడుతూ... అన్ని తరగతుల సిలబస్ పూర్తి అయిందని, 9,10 తరగతిలో పిల్లలకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పాఠశాలలో మెనూ ప్రకారం మధ్యాహ్నం ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజనం అందిస్తున్నట్లు అధికారులకు వివరించారు.