calender_icon.png 9 January, 2026 | 4:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం వడ్డించాలి

07-01-2026 12:11:51 AM

మాగనూరు, జనవరి 6: ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు మెన్ ప్రకారము నాణ్యమైన భోజనాన్ని  అందివాలని నేరడ గమ్ము సర్పంచ్ దాసరి వెంకటమ్మ వంట ఏజెన్సీలను ప్రధానోపాధ్యాయులను కోరారు . మంగళవారం మాగనూరు మండల పరిధిలోని నేరడ గమ్ము గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల, ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, ఉర్దూ మీడియం పాఠశాలలను, సర్పంచ్ దాసరి వెంకటమ్మ ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. 

విద్యార్థులతో కలిసి భోజనం చేశారు.అదేవిధంగా పాఠశాల విద్యార్థులకు క్రీడా సామాగ్రిని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ చదువుతోపాటు విద్యార్థులు క్రీడల్లో రాణించాలని క్రీడల వల్ల మానసిక ఉల్లాసం , శరీర దృఢత్వం, మేధాశక్తి ,కలుగుతుందన్నారు. క్రీడల్లో రాణించి జిల్లా ,రాష్ట్రస్థాయికి విద్యార్థులు ఎంపిక కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ రవి రాజా, వార్డ్ మెంబర్లు డి ప్రకాష్ ,,వెంకటేష్, ప్రధాన ఉపాధ్యాయులు రాజేష్ కుమార్ ,ఉపాధ్యాయులు రామ్మోహన్ ,టీచర్లు ,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.