calender_icon.png 10 January, 2026 | 9:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పర్యావరణ పరిరక్షణకు నర్సరీలు దోహదపడతాయి

09-01-2026 08:46:30 PM

నాణ్యమైన మొక్కలు పెంచేందుకు కృషి చేయాలి

సర్పంచ్ మేకపోతుల వెంకటమ్మ చంద్రయ్య 

గరిడేపల్లి,(విజయక్రాంతి): పర్యావరణ పరిరక్షణకు నర్సరీలు ఎంతగానో దోహదపడతాయని నర్సరీల ద్వారా నాణ్యమైన మొక్కలను పెంచాలని గరిడేపల్లి సర్పంచ్ మేకపోతుల వెంకటమ్మ చంద్రయ్య కోరారు. మండల కేంద్రమైన గరిడేపల్లిలో 2025-26 సంవత్సరానికి గాను ఏర్పాటు చేసిన నర్సరీని శుక్రవారం ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నర్సరీని పర్యవేక్షణ చేసేవారు నాణ్యమైన మొక్కలను అందించే విధంగా కృషి చేయాలని ఆమె కోరారు.నాణ్యమైన మొక్కలను అందించడం ద్వారా మెరుగైన ఫలితాలను సాధించే అవకాశం ఉంటుందని ఆమె తెలిపారు.