09-01-2026 09:12:04 PM
మనోహరాబాద్,(విజయక్రాంతి): మనోహరాబాద్ మండలం ఎంపీడీవో కార్యాలయాన్ని జెడ్పి సీఈఓ ఎల్లయ్య ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వార్షిక తనిఖీలో భాగంగా కార్యాలయం యొక్క విధి నిర్వహణలకు సంబంధించిన రిజిస్టర్లను తనిఖీ చేసి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సమర్థవంత పాలనకు సూచనగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల అభివృద్ధి అధికారి రవీందర్, కార్యాలయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు