09-01-2026 08:48:57 PM
సిర్గాపూర్,(విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండల కేంద్రంలో శుక్రవారం చీఫ్ మినిస్టర్ కప్ టార్చ్ ర్యాలీ ఉత్సాహంగా నిర్వహించబడింది. ఈ ర్యాలీ గ్రామ సర్పంచ్ శ్రీనివాస్ రావు పటిల్ ప్రత్యేకంగా పాల్గొని ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...యువత క్రీడలలో రాణించి మండలానికి, గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని పిలుపునిచ్చారు. ర్యాలీలో స్థానిక ప్రభుత్వ పాఠశాల జిల్లా పరిష్యత్ పాఠశాల విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
పాఠశాల ప్రధానోపాధ్యాయులు నాగరం శ్రీనివాస్ పర్యవేక్షణలో విద్యార్థులు క్రీడా స్పూర్తిని ప్రదర్శిస్తూ ర్యాలీని మరింత రంజుగా మార్చారు. ఉపాధ్యాయులు కూడా తమ విద్యార్థులను ప్రోత్సహిస్తూ ర్యాలీతో పాటు మండల కేంద్రంలో నడిచారు. గ్రామంలోని ప్రజలు, యువత, క్రీడాభిమానులు ర్యాలీని అద్భుతంగా స్వాగతించి, గ్రామమంతా ఉత్సాహ వాతావరణం నెలకొంది. ర్యాలీ గ్రామం ప్రధాన వీధుల మీదుగా పర్యటించి, చివరకు గ్రామ పంచాయతీ ప్రాంగణంలో ముగిసింది.