17-11-2025 05:29:29 PM
మేడ్చల్ అర్బన్ (విజయక్రాంతి): మేడ్చల్ పట్టణంలో అక్షయ సమృద్ధి ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. రోడ్డున తిరిగే అనాధలకు, అభాగ్యులకు కడుపునిండా అన్నం పెట్టాలని ఉద్దేశంతో ప్రతి సోమవారం ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అధ్యక్షుడు ముల్లంగిరి శ్రీహరి చారి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి జిల్లా ట్రేడ్ యూనియన్ ప్రధాన కార్యదర్శి ఆరే సన్నీ కుమార్ వంజరి, హైదరాబాద్ గ్రేటర్ యూనియన్ అధ్యక్షుడు ఆరే పవన్ కళ్యాణ్ వంజరి ఆర్థిక సాయం చేశారు.