30-01-2026 01:52:46 AM
22 మంది విద్యార్థులకు అస్వస్థత
సంగారెడ్డి జిల్లా వెంకటాపూర్‌లో ఘటన
ప్రైవేట్ ఫంక్షన్‌లో మిగిలిన ఆహార పదార్థాలతో మధ్యాహ్న భోజనం వండిపెట్టిన నిర్వాహకులు
నారాయణఖేడ్, జనవరి 29: సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండల పరిధిలోని వెంకటాపూర్ ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించి 22 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురైన సంఘటన గురువారం చోటుచేసుకుంది. మధ్యాహ్నం భోజనానికి సంబంధించి ఒక ప్రైవేట్ ఫంక్షన్‌లో రాత్రి మిగిలిన ఆహార పదార్థాలు విద్యార్థులకు వడ్డించడంతో ఫుడ్ పాయిజన్ జరిగి వాంతులు, విరేచనాలు చేసుకున్నారు. వారిని నారాయణఖేడ్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. మధ్యాహ్నం భోజన నిర్వాహకులు నిర్లక్ష్యంగా వ్యవహరించి ప్రైవేట్ ఫంక్ష న్‌లో మిగిలిన ఆహార పదార్థాలు విద్యార్థులకు వడ్డించడంతోనే ఈ సంఘటన చోటుచేసుకుందని స్థానికులు ఆరోపించారు.
స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ పి సంజీవరెడ్డి ఆసుపత్రిని చేరుకొని విద్యార్థుల ఆరోగ్య స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు మెరుగైన వైద్య చికిత్సలు అందించాలని వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ రమేష్‌కు సూచించారు. మధ్యాహ్న భోజనంలో నిర్లక్ష్యం వ హించిన పాఠశాల ఉపాధ్యాయులు, మధ్యా హ్న భోజన నిర్వాహకులపై చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. అస్వస్థత కు గురైన విద్యార్థులను స్థానిక సబ్ కలెక్టర్ ఉమా హారతి సైతం పరామర్శించారు. అధికారుల నిర్లక్ష్యం వల్లనే నారాయణఖేడ్ ప్రాం తంలో మధ్యాహ్న భోజనం ఫుడ్ పాయిజన్, హాస్టల్ నిర్వాహకుల నిర్లక్ష్యం వంటి సంఘటనలు అనేకం చోటు చేసుకుంటున్నారని మాజీ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి ఆరోపించారు.