calender_icon.png 27 December, 2025 | 3:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బరంపూర్ గ్రామ అభివృద్ధికి కృషి

27-12-2025 01:59:25 AM

సర్పంచ్, ఉపసర్పంచ్‌ల ఆత్మీయ సన్మానంలో ఎమ్మెల్యే అనిల్ జాదవ్

తలమడుగు, డిసెంబర్ 26 (విజయక్రాంతి): 70 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత పంచాయితీకి ఎన్నికలు జరిగినా బరంపూర్ గ్రామ పంచాయతీ  అభివృద్ధికి తనవంతుగా కృషి చేస్తానని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పేర్కొన్నారు. మండలం లోని బరంపూర్‌లో బీఆర్‌ఎస్ పార్టీ బలపరిచి నూతనంగా ఎన్నికైన సర్పంచ్, ఉప సర్పంచ్‌ల ఆత్మీయ సన్మాన కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై నూతన సర్పంచ్, ఉప సర్పంచ్లను శాలువాలతో సత్కరిం చి అభినందించారు.  అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ గత 69 సంవత్సరాలుగా గ్రామం ఐక్యతతో సర్పంచిని ఏకగ్రీవంగా  ఎన్నుకోవడం జరి గిందని, గ్రామంలో కొందరు చిచ్చుపెట్టారని, అయినా కూడా గ్రామం అంతా ఏకతాటిగా బీఆర్‌ఎస్ వార్డ్ మెంబర్లు , సర్పంచును ఎన్నుకోవడం అభినందనీయమన్నారు.

తప్పకుండా గ్రామ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో దేవాలయ కమిటీ అధ్యక్షులు ముడుపు కేదారేశ్వర్ రెడ్డి, సామాజిక కార్యకర్త ముడుపు మౌనిష్ రెడ్డి, బరంపూర్ సర్పంచ్ మెస్రం దేవరావు ఉప సర్పంచ్ మెరుగు రంజిత్ రెడ్డి, మాడురి మల్లేష్, బోథ్ బిఆర్‌ఎస్ పార్టీ అధికార ప్రతినిధి మొట్టే కిరణ్, మండల కన్వీనర్ తోట వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.