15-05-2025 12:17:59 AM
2012లో ‘పద్మవ్యూహం’ అనే మలయాళ చిత్రంతో సినీరంగంలో అడుగుపెట్టింది అమృత అయ్యర్. తెలుగులో రామ్ పోతినేని హీరోగా నటించిన ‘రెడ్’తో టాలీవుడ్‌కు పరిచయమైంది. ఆ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను మెప్పించ లేకపోయినా.. అమృత నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఆ తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ నటనపరంగానే కాకుండా అందంతో నూ యూత్‌కు డ్రీమ్‌గాళ్‌గా మారిపోయింది.
ఇక ‘హనుమాన్’ సినిమాతో భారీ హిట్ అందుకుంది. తెలుగులో చివరగా అల్లరి నరేశ్‌తో ‘బచ్చలమల్లి’లో కనిపించింది. ఇప్పుడు శాండిల్‌వుడ్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందు కు సిద్ధమైంది. కన్నడలో తొలిసారిగా హీరోయిన్‌గా నటిస్తున్న ఆ సినిమా శ్రీరామనవమి రోజు ప్రారంభమైంది. సినిమాటోగ్రాఫర్ అరసు అంతరే దర్శకత్వం వహిస్తున్న రెండో చిత్రమిది.
ఇందులో గణేశ్ హీరోగా నటిస్తున్నారు. బుధవారం అమృత అయ్యర్ బర్త్‌డే. ఈ సందర్భంగా ఆమె శుభాకాంక్షలు తెలియజేస్తూ ఓ అప్‌డేట్ ఇచ్చింది ఈ మూవీ టీమ్. ఈ సినిమా టైటిల్ టీజర్ త్వరలో విడుదల చేయనున్నట్టు వెల్లడించింది.