calender_icon.png 8 September, 2025 | 3:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీఎం రేవంత్ సభను విజయవంతం చేయాలి

02-09-2025 12:00:00 AM

పినపాక ఎమ్మెల్యే పాయం వెంక టేశ్వర్లు 

మణుగూరు, సెప్టెంబర్ 1 (విజయక్రాంతి) : జిల్లాలో జరిగే సీఎం బహిరంగ సభను విజయవంతం చేయాల ని, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పిలుపు నిచ్చారు. సోమవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రుగొండ మండ లం బెండాలపాడు గ్రామంలో సెప్టెంబర్ 3న  నిర్వహించే  బహిరంగ సభకు ముఖ్య మంత్రి రేవంత్రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొంటారని తెలిపారు.

జిల్లాలో ప్రజల సమస్యల ను కళ్లారా చూసిన సీఎం రేవంత్రెడ్డి వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నారన్నారు. నియోజకవర్గ నుండి  పార్టీ కార్యకర్తలు, నాయకు లు పెద్ద ఎత్తున తరలి వచ్చి సభను విజయవతం చేయాలని సూచించారు. సభకు అన్ని గ్రామాల నుంచి ప్రజల ను భారీగా తరలిం చా లన్నారు. సీఎం రేవం త్ రెడ్డి మొక్కవోని ధైర్యంతో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నాడన్నారు. అన్ని వర్గాల ప్రజలకు ప్రభుత్వం చేయూతని స్తుందన్నారు.