calender_icon.png 26 November, 2025 | 2:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీపీఐ జిల్లా మాజీ కార్యదర్శి వీఎల్ నర్సింహారెడ్డి గుండెపోటుతో మృతి

26-11-2025 12:00:00 AM

కామారెడ్డి, నవంబర్ 25 (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా భారత కమ్యూనిస్టు పార్టీ  కామారెడ్డి జిల్లా మాజీ కార్యదర్శి, సీనియర్ న్యాయవాది వీఎల్ నరసింహారెడ్డి సోమవారం రాత్రి గుండెపోటుతో మృతి చెందారు.  ఆయన కామారెడ్డి జిల్లాతో పాటు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో సిపిఐ పార్టీ నీ పటిష్టవంతం చేయడమే కాకుండా శ్రామిక వర్గాలకు, నిరుపేదలకు, కార్మిక వర్గం కోసం గత 40 ఏళ్లుగా నిరంతరం పోరాటాలు చేసిన చరిత్ర ఆయనది. అదేవిధంగా కార్మికుల హక్కుల కోసం, నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడి చివరి శ్వాస వరకు అనేక ప్రజా ఉద్యమాల్లో పాల్గొని నిస్వార్ధంగా పనిచేశారు.

దీంతో కార్మిక లోకం ఆయన మృతిపట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మున్సిపల్, హమాలి, బిడి కార్మికుల పక్షాన పోరాడటమే కాకుండా న్యాయవాదిగా ఆయన బడుగు బలహీనవర్గాలకు సేవలందించారు. వివిధ కార్మిక ఉద్యమాల్లో పాల్గొనడంతో పాటు ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో కూడా ఆయన కీలకపాత్ర పోషించారు. ఆయన మృతి పట్ల బార్ అసోసియేషన్ లో సంతాపం వ్యక్తం చేశారు.

ఆయన మృతి బారాసోసియేషన్ కి చేసిన సేవలు తీరని లోటు అని బార్ ఆసోసియేషన్ అధ్యక్షుడు నందరమేష్, అన్నారు. ఆయన చేసిన సేవలను కొనియాడారు. బారాసోసియేషన్ ఒక సీనియర్ న్యాయవాదిని కోల్పోవడం తీరని లోటు అని పేర్కొన్నారు.