calender_icon.png 23 August, 2025 | 11:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హేమచలంలో మాజీ డిజిపి దంపతులు

23-08-2025 07:37:00 PM

మంగపేట,(విజయక్రాంతి): తెలంగాణ మాజీ డిజిపి గోపినాథ్ రెడ్డి దంపతులు శనివారం మల్లూరు శ్రీ హేమాచల లక్ష్మీనృసింహ స్వామి దేవాలయాన్ని దర్శించుకున్నారు. ఆలయ సాంప్రదాయం ప్రకారం ఆలయ అర్చకులు నూతన కార్యనిర్వాహణాధికారి రేవెల్లి మహేష్ మాజీ రెన్యువలెషన్ కమిటీ చైర్మన్ సురేష్ డిజిపి దంపతులకు స్వాగతం పలికి గర్భగుడిలోని స్వామివారి నిజరూప దర్శనం, అర్చనలు, అభిషేకలు గోత్ర నామాచార్ణాలతో తీర్థప్రసాదాలు ఇచ్చి స్వామివారి నాభి చందనం, విశేష వస్త్రాలను అందించి ఆలయ విశిష్టత ప్రాముఖ్యతలను వివరించారు. వీరి వెంట మంగపేట ట్రైనీ ఎస్సై లు సురేష్, శ్రీకాంత్ పోలీస్ సిబ్బంది, ఆలయ సిబ్బంది ఉన్నారు.