calender_icon.png 24 August, 2025 | 12:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ వసతి గృహాలలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు

23-08-2025 07:40:27 PM

మహబూబాబాద్,(విజయక్రాంతి): మహబూబాబాద్ పట్టణంలోని సాంఘిక సంక్షేమ శాఖ ఫార్మసీ కాలేజ్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. అలాగే అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టోప్పో కేసముద్రం మండల కేంద్రంలోని తెలంగాణ  ట్రైబల్ వెల్ఫేర్ గిరిజన బాలికల జూనియర్ కాలేజ్, కల్వల  జిల్లా పరిషత్ హై స్కూల్ ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థినీ, విద్యార్థుల మేధస్సును వెలికితీయడానికి నూతన టెక్నాలజీ ఉపయోగించి, సబ్జెక్టుల వారీగా విద్యా బోధనలు అందించుటకు ఉపాధ్యాయులు అంకిత భావంతో పనిచేయాలని ఆదేశించారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన డైట్ మెనూ ప్రకారం రుచికరమైన నాణ్యమైన ఆహారాన్ని అందించాలన్నారు.

సమాజంలో అత్యంత గౌరవప్రదమైన వృత్తి, ఉపాధ్యాయ వృత్తి అని, ప్రతి ఒక్కరు విద్యాసంస్థల నుండి భావి భారత పౌరులుగా బయటకి వస్తారని, అందులో కీలకపాత్ర ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు ఉంటుందన్నారు. ప్రభుత్వం కల్పించిన డైట్ మెనూ ద్వారా అన్ని ప్రభుత్వ వసతి గృహాలు, విద్యాసంస్థలలో పిల్లలకు రుచికరమైన ఆహారం అందుతుందని, తద్వారా పిల్లలు ఆరోగ్యంగా ఉండి చదువులపై దృష్టి పెట్టడం జరుగుతుందని మంచి ఉద్దేశంతో ఈ పథకం అమలు చేయడం జరుగుతుందన్నారు.  ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్, డిజిటల్ తరగతులను ప్రభుత్వం కల్పించినందున ఉపాధ్యాయులు ఈ సాధనాల ద్వారా పిల్లల మేధస్సును వెలికి తీసి వారిని ప్రతి సబ్జెక్టు వారీగా సామర్ధ్యాలను గుర్తించాలన్నారు.

మధ్యాహ్న భోజనం సిద్ధం చేసే సిబ్బంది తగిన జాగ్రత్తలు వహిస్తూ ఉండాలని, విద్యా సంస్థలోని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. పిల్లలకు షెడ్యూలు ప్రకారం వైద్య పరీక్షలు నిర్వహించాలని, మానసిక వైద్య నిపుణుల చేత కౌన్సెలింగ్ నిర్వహించాలన్నారు. ఈ సందర్భంగా వారు డైనింగ్ హాల్, కిచెన్ షెడ్, మరుగుదొడ్లు, తరగతి గదులు, స్టోర్ రూమ్ తదితర ప్రదేశాల పరిసరాలను పరిశీలించారు. విద్యార్థుల అభ్యసన సామర్ధ్యాలను స్వయంగా వారిని అడిగి తెలుసుకున్నారు. మండలాల ప్రత్యేక అధికారులు ప్రస్తుతం జరుగుతున్న యూరియా పంపిణీ కార్యక్రమంతో పాటు అన్ని వసతి గృహాలను సందర్శించాలని సూచించారు. ఈ పర్యటనలో కలెక్టర్, అదనపు కలెక్టర్ వెంట సంబంధిత సిబ్బంది ఉపాధ్యాయులు ఉన్నారు.