calender_icon.png 4 October, 2025 | 10:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హుజూరాబాద్ మాజీ జడ్పీటీసీ బక్కారెడ్డి మృతి

04-10-2025 08:44:44 PM

హుజూరాబాద్,(విజయక్రాంతి): హుజూరాబాద్ మాజీ జడ్పీటీసీ పడిదం బక్కారెడ్డి కరీంనగర్లో ఓ  ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం తుదిశ్వాస విడిచారు. కరీంనగర్ జిల్లాహుజూరాబాద్ మండలం కందుగుల గ్రామానికి చెందిన బక్కారెడ్డి బీఆర్ఎస్ పార్టీ నుండి 2018 లో జరిగిన ఎన్నికల్లో జడ్పీటీసీగా గెలుపొందారు. ఆయన మృతి పట్ల ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తోపాటు పలువురు రాజకీయ నాయకులు సంతాపం వ్యక్తం చేశారు. బక్కారెడ్డి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. బక్కారెడ్డి మరణం పార్టీకి తీరని లోటని అన్నారు.