04-10-2025 08:41:43 PM
సిర్గాపూర్ (విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండల పరిధిలోని లక్ష్మణ్ నాయక్ తండా ప్రాథమిక పాఠశాలను శనివారం ఎంఈవో నాగారం శ్రీనివాస్ సందర్శించి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఇక్కడ కొనసాగుతున్న ఎఫ్ఎల్ఎన్ బోధన సామర్థ్యాలు, విద్యార్థుల అభ్యాసన ఆయన సమీక్షించారు. ప్రాథమిక విద్యాభ్యాసం మెరుగు కోసం టీచర్లు కృషి చేయ్యాలని ఎంఈఓ నాగారం శ్రీనివాస్ సూచించారు. అనంతరం టీచర్లు, విద్యార్థుల హాజరు శాతం, మధ్యాహ్న భోజనం అమలు తీరుపై పరిశీలించారు.