calender_icon.png 7 November, 2025 | 1:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హరీష్‌రావును పరామర్శించిన జుక్కల్ మాజీ ఎమ్మెల్యే షిండే

07-11-2025 12:06:02 AM

బిచ్కుంద, నవంబర్ 6 (విజయక్రాంతి) ః కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీ ష్రరావు తండ్రి తన్నీరు సత్యనారాయణరావు అక్టోబర్ 28న మృతి చెందిన విషయం తెలిసిందే.

గురువారం జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే  మాజీ మంత్రి హరీష్ రావును పరామర్శించారు. సత్యనారాయణ రావు చిత్రపటానికి పూలమాలలతో ఘనంగా నివాళులు అర్పించారు.అనంతరం వారి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.తండ్రి కోల్పోవడం కుటుంబానికి భర్తీ కాని లోటు అని తెలిపారు. తండ్రి స్ఫూర్తితో హరీష్ రావు ప్రజాసేవలో ముందుకు సాగాలని ఆకాంక్షించారు.