calender_icon.png 18 September, 2025 | 1:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చెంగిచెర్ల-చర్లపల్లి రోడ్డుకు మహర్దశ

18-09-2025 12:07:20 AM

మేడ్చల్,(విజయక్రాంతి): చెంగిచెర్ల నుండి చర్లపల్లి ప్రధాన మార్గంలో గతంలో ప్రారంభించి వదిలేసిన రోడ్డు పనులు తిరిగి ప్రారంభం కానున్నాయని బోడుప్పల్ కార్పొరేషన్ మాజీ మేయర్ తోటకూర అజయ్ యాదవ్ తెలిపారు. బుధవారం హెచ్ఆర్డీసీఎల్(HRDCL) అధికారులు ఈఈ, డీఈల ఆధ్వర్యంలో అసంపూర్తిగా ఉన్న రోడ్డు పనులను పరిశీలించారు. అనంతరం అజయ్ యాదవ్ మాట్లాడుతూ... గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా చెంగిచెర్ల-చర్లపల్లి రోడ్డు పనులు అసంపూర్తిగా ఉన్నాయని  అన్నారు. మేడ్చల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ తోటకూర వజ్రెష్ యాదవ్  చొరవతో అధికారులు ఈ రోజు రోడ్డును పరిశీలించి త్వరలోనే రోడ్డు పనులు పూర్తి చేసేందుకు కృషి చేస్తామని తెలిపారు.