27-09-2025 06:40:11 PM
గద్వాల: మత్తు పదార్థాల రహిత జిల్లాగా మార్చేందుకు అన్ని శాఖల అధికారులు సమిష్టిగా కృషి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ (రెవిన్యూ) లక్ష్మి నారాయణ అధికారులకు ఆదేశించారు. శనివారం ఐడీఓసీలోని తన ఛాంబర్ లో మాదక ద్రవ్యాల నిర్మూలన నార్కోటెక్ కోఆర్డినేషన్ కమిటీ సమావేశంలో సంబంధిత అధికారులతో పాల్గొని మాట్లాడారు. జిల్లాలో నిషేధించబడిన మత్తు పదార్థాల సరఫరా లేకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలన్నారు.
పాఠశాలలు, కళాశాలల వద్ద డ్రగ్స్ ను విక్రయించకుండా పూర్తి నిఘా పెట్టాలన్నారు.జిల్లాలో గంజాయి సాగు జరుగకుండా అధికారులు సమన్వయంతో పర్యవేక్షించాలని తెలిపారు. ప్రత్యేకంగా రైల్వే స్టేషన్,బస్ స్టేషన్లలో గట్టి నిఘా పెట్టాలన్నారు. జోగులాంబ గద్వాల జిల్లాలో మత్తు పదార్థాలను ప్రజలు వినియోగించకుండా, యువత మత్తు పదార్థాలకు బానిసలు కాకుండా ప్రజల్లో విస్తృత ప్రచారం చేసి అవగాహన కల్పించాలని తెలిపారు.