29-09-2025 12:00:00 AM
జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన కేంద్ర మంత్రి బండి సంజయ్
కొత్తపల్లి, సెప్టెంబరు 28 (విజయ క్రాంతి): మాజీ మేయర్ యాదగిరి సునీల్ రావు జన్మదిన వేడుకలు ఆదివారం ఘనం గా జరిగాయి. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ యాదగిరి సునీల్ రావును శాలువాతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. జన్మది నం సందర్భంగా సునీల్ రావు హరిహర క్షే త్రం శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయంలో స్వామి వారి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
అలాగే భగత్ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కేక్, క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన కేక్ ను ఆయన కట్ చేశారు. పలువురు నాయకులు, బిజెపి శ్రేణులు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలుతెలియజేశారు.