calender_icon.png 29 September, 2025 | 5:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అమ్మవారికి ఎమ్మెల్యే హరీశ్ రావు ప్రత్యేక పూజలు

29-09-2025 12:00:00 AM

ఎల్బీనగర్, సెప్టెంబర్ 28 : మహేశ్వరం నియోజకవర్గం సరూర్నగర్ డివిజన్ హుడా కాలనీలో మాత వాగ్దేవి అసోసియేషన్ ఆధ్వర్యంలో దేవీ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో మాజీ మంత్రి, ఎమ్మెల్యే తనీష్ హరీశ్ రావు, ఎస్సీ, ఎస్టీ కమిషన్  మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, దేవి ప్రసాద్  తదితరులు ఆదివారం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.  12 సంవత్సరాలుగా దేవీ నవరాత్రుల సందర్భంలో ప్రతిరోజు శత చండీ హోమం, అన్నదానం  నిర్వహిస్తున్న అసోసియేషన్ సభ్యులను అభినందించారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు పోలే సుధామ, ప్రత్యూష్, రాజు, అభిలాష్, కట్ట ప్రవీణ్, దయాకర్, అరవింద్, శ్రీధర్, ప్రవీణ్, కార్తీక్, నిఖిలేష్, తదితరులు పాల్గొన్నారు.