calender_icon.png 17 December, 2025 | 8:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మార్చిలో బీసీ సింహగర్జన

17-12-2025 12:42:39 AM

  1. రిజర్వేషన్ల సాధనకు దేశాన్ని ఏకంచేస్తాం 
  2. జనవరిలో దేశవ్యాప్త పర్యటన 
  3. పార్లమెంటులో కాంగ్రెస్ ప్రైవేట్ బిల్లును పెట్టాలి 
  4. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు మద్దతు తెలపాలి 
  5. స్పందించకుంటే రైతు ఉద్యమ తరహాలో బీసీ ఉద్యమం 
  6. ఢిల్లీలో ఓబీసీ జాతీయ సెమినార్‌లో బీసీ జేఏసీ నేతలు

ఢిల్లీ, డిసెంబర్ 16 (విజయక్రాంతి): బీసీ రిజర్వేషన్ల కోసం పోరాటం చేస్తున్న అన్ని రాష్ట్రాలను కలుపుకొని దేశవ్యాప్తం గా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని తెలంగాణ బీసీ జేఏసీ చైర్మన్, బీసీ సంక్షేమ సం ఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ వెల్లడించారు. మార్చిలో లక్షలాది మందితో హైదరాబాదులో బీసీ సింహ గర్జన సభను నిర్వహిస్తామని ప్రకటించా రు. మంగళవారం న్యూఢిల్లీలోని తెలంగా ణ భవన్‌లోని సెమినార్ హాల్‌లో ఓబీసీ జాతీయ సెమినార్‌ను నిర్వహించారు.

ఈ సెమినార్‌కు బీసీ జేఏసీ వర్కింగ్ చైర్మన్ గుజ్జ కృష్ణ, అధికార ప్రతినిధి తాటికొండ విక్రమ్ సమన్వయం చేయగా సీపీఐ జాతీ య కార్యదర్శి కె నారాయణ, మాజీ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్, మాజీ ఎంపీ వీ హనుమంతరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా జాజుల శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా ఉన్న 50 శాతం పరిమితిని ఎత్తివేసి జనాభా దామా ష ప్రకారం బీసీ రిజర్వేషన్లు పెంచాలని 11 రాష్ట్రాల అసెంబ్లీలో తీర్మానం చేసి, కేంద్ర ప్రభుత్వానికి పంపించాలని, ఇంకొక వైపు రిజర్వేషన్లు పెంచుకునే అవకాశం కల్పించాలని సుప్రీంకోర్టులో న్యాయపోరాటం చేస్తున్నారని చెప్పారు.

బీసీ రిజర్వేషన్ల పెంపుపై కాంగ్రెస్ పార్టీ పార్లమెంటులో ప్రవేట్ బిల్లును ప్రవేశపెట్టాలని, ఈ బిల్లుకు బీజేపీ మద్దతు పలకాలని డిమాండ్ చేశారు. లేదంటే ఇప్పటికే బీఆర్‌ఎస్ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర పార్లమెంటులో ప్రవేశపెట్టిన ప్రైవేట్ బిల్లుకు కాంగ్రెస్, బీజేపీలు మద్దతు పలకాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లపై స్పందించకపోతే రైతు ఉద్యమ తరహాలోనే దేశాన్ని ఒక్కటి చేసి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

ఫిబ్రవరిలో తెలంగాణలో రాష్ట్రవ్యాప్త బీసీ యాత్ర చేపట్టి, మార్చిలో లక్షలాదిమందితో హైదరాబాదులో బీసీ సింహ గర్జన సభ ను నిర్వహించి బీసీల తడాఖాను ఢిల్లీ పెద్దలకు చూపిస్తామని హెచ్చరించారు. సీపీఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ మాట్లాడుతూ.. జనాభాలో 56% పైగా ఉన్న బీసీలను అన్ని పార్టీ లు మోసం చేస్తున్నాయని, ఒకవైపు రాజకీయ పార్టీలు అన్యాయం చేస్తుంటే.. బీసీ నాయకులే బీసీలను బలి తీసుకుంటున్నారని విమర్శించారు.

బీసీ ఉద్యమా నికి జాతీయస్థాయిలో సీపీఐ అండగా ఉంటుందని ఆయన ప్రకటించారు. వి హనుమంతరావు మాట్లాడుతూ.. బీసీ రిజర్వేషన్లపై పార్లమెంటులో ప్రవేట్ బిల్లు ను ప్రవేశపెట్టాలని రాహుల్‌గాంధీకి తాను లేఖ రాశానని, అతి త్వరలోనే ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రధాన కార్యదర్శి కేసి వేణుగోపాల్‌ను పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌తో కలిసి ఒత్తిడి తీసుకొస్తామని తెలిపారు.

కాంగ్రెస్, బీజేపీలదే బాధ్యత: శ్రీనివాస్‌గౌడ్ 

మాజీ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ.. బీసీ రిజర్వేషన్ల పెంపు బాధ్యత కాంగ్రెస్, బీజేపీ పార్టీలదేనని, వారిపైన ఒత్తిడి పెంచడానికి తెలంగాణ ఉద్యమ తరహాలోనే బీసీ ఉద్యమాన్ని చేపడతామని ఆయన తెలిపారు. బీసీ రిజర్వేషన్ల సాధన కోసం బీఆర్‌ఎస్ పార్లమెం టులో ప్రైవేట్ బిల్లును ప్రవేశపెట్టిందని తెలిపారు. బీసీ జేఏసీ ఉద్యమానికి బీఆర్‌ఎస్ సంపూర్ణ మద్దతు తెలియజేస్తుందని ప్రకటించారు. ఈ సమావేశంలో బీసీ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ పెరిక సురేష్, ప్రొఫెసర్ సంఘని మల్లేశ్వర్, బీసీ జేఏసీ నేతలు పిట్ల శ్రీధర్, బి మనీ మంజరి, కవుల జగన్నాథం, కే వీరస్వామి, జాజుల లింగం, నందగోపాల్, వేముల రామకృష్ణ పాల్గొన్నారు.