calender_icon.png 18 July, 2025 | 6:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అందరి అభివృద్ధి ప్రభుత్వ లక్ష్యం

18-07-2025 12:00:00 AM

ఇందిరా మహిళా శక్తి సంబరాలలో ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి 

దేవరకద్ర జూలై 17 : అందరి అభివృద్ధి లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తుందని దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి స్పష్టం చేశారు. దేవరకద్ర మండల కేంద్రంలో శ్రీనివాస్ గార్డెన్ లో గురువారం ఇందిరా మహిళా శక్తి సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమనికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే జీ, మధుసూదన్ రెడ్డి హాజరయ్యారు.

ఈ సందర్భంగా వి విధ మండల మహిళా సంఘాలకు వేలాది చెక్కులను పంపిణీ చేశారు, అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిళల ఆధ్వర్యంలో నడిపించబోయే ఆర్టీసీ అద్దె బస్సులు ఇవ్వనున్నారన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యం కోటి మంది మహిళలను కోటిశ్వరులుగా తీర్చడం.

యన నాయకత్వంలో ఏర్పడిన ప్రభుత్వం ఏర్పడిన 48 గంటలకే మహిళల ప్రయాణ భారం తొలగించేందుకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అమలు చేసిందని, ఇప్పుడీ ప్రయాణికులనే బస్సు ఓనర్లుగా మార్చిన ఘనత కూడా మన ప్రభుత్వానిదన్నారు. ప్రతి ఒక్కరి సంక్షేమం కోసం తెలంగాణ ప్ర భుత్వం రక్షణ కవచంలా పనిచేస్తుందని తెలియజేశారు.

ప్రతి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లు ని ర్మించుకుంటూ పండుగ వాతలను దర్శనమిస్తుందని స్పష్టం చేశారు. కనివిని ఎరుగని రీతిలో ప్రతి ఒక్కరిని ఉన్నత స్థాయికి తీసుకురావడం అనే సంకల్పంతో ప్రజా పాలన ప్రతి అడుగు ముందుకు వేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి, అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, అధికారులు ప్రజాప్రతినిధులు ఉన్నారు.