24-01-2026 01:20:18 AM
మల్లేపల్లి, జనవరి 23: లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ (గ్రీన్ ల్యాండ్స్), సేవా భారతి, మెర్సీ మిషన్, రామ్కీ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత మెగా ప్లాస్టిక్ సర్జరీ క్యాంపునకు మల్లేపల్లిలోని డా. ఈశ్వరచందర్ చారిటబుల్ హాస్పిటల్‌లో శ్రీకారం చుట్టారు. శుక్రవారం స్క్రీనింగ్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. మొదటి రోజున డా. సుదర్శన్ రెడ్డి, డా. గులాబీ రాణీలు మొత్తం 64 మంది రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి తెలంగాణ పోలీస్ అకాడమీ డిప్యూటీ డైరెక్టర్, డీసీపీ పరవస్తు మధుకర్ స్వామి అధ్యక్షత వహించారు. ప్రొఫెసర్ లక్ష్మికుమారి, లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ (గ్రీన్ ల్యాండ్స్) ప్రతినిధులు విద్యాభూషణ్, రఘునాథరెడ్డి, రామ్కీ ఫౌండేషన్ నిర్వాహకులు రామిరెడ్డి, డా. సరస్వతి, దుర్గా రెడ్డి పాల్గొన్నారు.