05-05-2025 01:43:00 AM
కోహీర్,మే 4: వార్షిక జాతర బ్రహ్మోత్సవాలలో భాగంగా మండలంలోని నాగిరెడ్డిపల్లి గ్రామంలో వెలిసిన శ్రీ దుర్గా భవానీ మాత అమ్మవారిని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకు ముందు ఆలయ కమిటీ సభ్యులు, అర్చక బృందం మాజీ మంత్రిని ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు. పూలమాలలు, శాలువాలతో సత్కరించారు.
అమ్మవారి ఆశీస్సులతో రాష్ట్రం ఆభివృద్ధి పదంలో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. గ్రామ అభివృద్ధికి సహరిస్తానని హామీనిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు మానిక్ రావు, చింతా ప్రభాకర్, డిసిఎంఎస్ ఛైర్మెన్ శివకుమార్, మాజీ జెడ్పీ చైర్మన్ మంజశ్రీ జైపాల్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గుండప్ప, రామకృష్ణ రెడ్డి, బిఆర్‌ఎస్ మండల పార్టీ అధ్యక్షులు నర్సింహులు యాదవ్, సింగిల్ విండో ఛైర్మెన్ స్రవంతి రెడ్డి తదితరులుపాల్గొన్నారు.