calender_icon.png 23 December, 2025 | 3:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోటీ పరీక్షల్లో విద్యార్థులు రాణించాలి

23-12-2025 12:00:00 AM

రాష్ట్ర విద్యా కమిషన్ సభ్యుడు చారగొండ వెంకటేష్ 

కల్వకుర్తి టౌన్, డిసెంబర్ 22 : పోటీ పరీక్షల్లో విద్యార్థులు రాణించాలని తెలంగాణ రాష్ట్ర విద్యా కమిషన్ సభ్యులు చారకొండ వెంకటేష్ అన్నారు.  సోమవారం పట్టణంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో మిత్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన గణిత దినోత్సవం సందర్భంగా, విద్యార్థులకు నిర్వహించిన మిత్ర జనరల్ నాలెడ్జ్ మెగా టెస్ట్ కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. గణితంలో శ్రీనివాస రామానుజన్ చేసిన కృషిని విద్యార్థులకు వివరించారు.

ప్రతి ఒక్కరు వివిధ అంశాల్లో ప్రతిభ కనబరిచిన మేధావులను ఆదర్శంగా తీసుకొని భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. మెగా నాలెడ్జ్ టెస్టులో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు అందజేశారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ బృంగి ఆనంద్ కుమార్, మిత్ర ఫౌండేషన్ ఫౌండర్ చంద్రకాంత్ రెడ్డి, మిత్ర ఫౌండేషన్ అధ్యక్షుడు శ్రీకాంత్ నేత, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.