23-12-2025 12:00:00 AM
పీఎం శ్రీ స్కూళ్ల ప్రిన్సిపాల్స్, టీచర్ల కోసం నిర్వహణ
హైదరాబాద్, డిసెంబర్ 22 (విజయక్రాం తి): పాఠశాల విద్యా, సాహిత్య శాఖ, ఆల్ ఇం డియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఏఐసీటీఈ), విద్యా మంత్రిత్వ శాఖ ఇన్నోవేషన్ సెల్ (ఎంఐసీ) పీఎం శ్రీ స్కూళ్ల ప్రిన్సిపల్స్, టీచర్ల కోసం మూడు రోజుల ఐడీఈ బూట్‌క్యాంప్ నిర్వహిస్తున్నాయి. వాధ్వానీ ఫౌండేష న్ సహకారంతో జరుగుతున్న ఈ ఫేజ్ డిసెంబర్ 22 నుంచి 24 వరకు నర్సింహారెడ్డి ఇంజినీరింగ్ కళాశాల, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో జరుగుతుంది. ప్రొఫెసర్ సిథారాం టి.జి., ఏఐసీటీఈ చైర్మన్, ధీరజ్ సాహు, అదనపు సెక్రటరీ (పాఠశాల విద్యా శాఖ), డాక్టర్ అభయ్ జెరే, ఏఐసీటీఈ వైస్ చైర్మన్ డిసెంబ ర్ 17 ఈ క్యాంపులను ప్రారంభించారు.
రాష్ట్ర స్థాయిలో నరసింహారెడ్డి ఇంజినీరింగ్ కళాశాలలో జరిగింది. 195 మందికి పైగా ప్రిన్సిపా ల్స్, టీచర్లు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా గ్రూప్ యాక్టివిటీలు, డైవ్ వర్కింగ్ సెషన్లు, వర్క్‌షాపులు నిర్వహించారు. విద్యలో ఆవిష్కరణ ప్రాముఖ్యత, మార్పు తీసుకురావడానికి వ్యవహారిక వ్యూహాలు, ఆశావాద ఆలోచన శక్తిని నేర్చుకుంటారు. కార్యక్రమానికి ఛైర్మన్ జె నర్సింహారెడ్డి, కార్యదర్శి జె త్రిశూల్ రెడ్డి, కోశాధికారి త్రిలోక్‌రెడ్డి, కళాశాల డైరెక్టర్ డా ఏ మోహన్, ప్రిన్సిపాల్ డా.ఆర్. లోకనా థం, సమన్వయకర్త డా శోభన్ పాల్గొన్నారు.