10-08-2025 11:22:38 PM
మంథని,(విజయక్రాంతి): మంథని నియోజకవర్గంలోని మల్హర్ రావు మండలంలోని వల్లెంకుంట గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్, భూపాలపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అయిత ప్రకాష్ రెడ్డి తల్లి ఇటీవల మృతి చెందాగా వారి కుటుంబ సభ్యులను రాష్ట్ర ఐటి. పరిశ్రమలు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పరామర్శించారు. మృతురాలు చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. మంత్రి వెంట భూపాలపల్లి గ్రంథాలయ చైర్మన్ కోట రాజబాబు, మండల కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.