calender_icon.png 19 May, 2025 | 4:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యుత్ షాక్ తో మృతి చెందిన కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే

18-05-2025 10:29:40 PM

జుక్కల్, (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం గుల్ల తండా చెందిన  శంకబాయి, ఆమె కూతురు శివాని కూలర్ కు విద్యు తు షాక్ వచ్చి మృతి చెందిన విషయాన్ని తెలుసుకున్న జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హనుమంతు షిండే ఆదివారం గుల్ల గ్రామానికి వెళ్లి మృతి చెందిన కుటుంబ సభ్యులను ఓదార్చారు. వారిని పరామర్శించి 11 ఆర్థిక సాయం అందించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ జరిగిన సంఘటన దురదృష్టకరమని మనోవేదన చెందారు.  కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అదేవిధంగా వారి పిల్లల ఒక కూతురు కుమారునికి ఉన్నత విద్య కొరకు సహాయపడతానాన్ని మాజీ ఎమ్మెల్యే హనుమంత్ షిండే హామీ ఇచ్చారు. ఆయనతో పాటు పలువురు బిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.