25-07-2025 12:00:00 AM
మెదక్, జూలై 24(విజయక్రాంతి): బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) జన్మదినోత్సవం సందర్భంగా గురువారం ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి మర్యాద పూర్వకంగా కలసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
ఈమె వెంట మాజీ ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి, జిల్లా పరిషత్ మాజీ ఉపాధ్యక్షురాలు లావణ్య రెడ్డి, మెదక్ మున్సిపల్ మాజీ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్, న్యాయవాది జీవన్రావు, మాజీ కౌన్సిలర్ ఆర్కే శ్రీనివాస్, శంకరంపేట మండల పార్టీ అధ్యక్షులు పట్లోరి రాజు, నాయకులు జుబేర్ అహ్మద్, ఫాజిల్, ఫరూక్, అహ్మద్ ఉన్నారు.