calender_icon.png 7 September, 2025 | 5:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గణపతి నవరాత్రి ఉత్సవాలలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే తాటి

04-09-2025 09:21:40 PM

ములకలపల్లి (విజయక్రాంతి): ములకలపల్లి మండలంలోని జగన్నాధపురం, నల్లివారిగూడెం, నర్సాపురం, మంగపేట ఒడ్డురామవరం, సంజీవపల్లి గణేష్ ఉత్సవ కమిటీల ఆహ్వానం మేరకు అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు(Former MLA Thati Venkateswarlu) గురువారం గణపతి నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొని గణపయ్యను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా  కమిటీ సభ్యులు ఆయనను శాలువాలతో సత్కరించి సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గణనాథుడి ఆశీస్సులతో నియోజకవర్గ ప్రజలు ఆయురారోగ్యాలతో సుఖశాంతులతో సిరి సంపదలతో ఉండాలని గణపతిని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో పామర్తి వెంకటేశ్వరరావు, పోతుగంటి లక్ష్మణ్, దుర్గాప్రసాద్, ఊకె రవి, రామాచారి, నందమూరి సురేష్,కొప్పుల రాంబాబు,కనకం రవి,మాజీ సర్పంచ్ వాడే నాగరాజు, మరీదు నాగు తదితరులు పాల్గొన్నారు.