04-09-2025 09:24:05 PM
టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిల్ల శీను బాబు..
మహాదేవపూర్ (విజయక్రాంతి): గురువులు సమాజ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తారని, తమ జీవిత కాలాన్ని విద్యార్థుల భవిష్యత్తు కోసం అంకితం చేసి సమాజానికి వెలుగులను అందిస్తారని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిల్ల శీను బాబు(TPCC General Secretary Duddilla Srinubabu) అన్నారు. గురువారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండల కేంద్రంలో గురుపూజోత్సవం సందర్భంగా మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో విశ్రాంత ఉద్యోగులు, గురువుల సన్మాన కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న దుద్దిల్ల శీను బాబు మాట్లాడుతూ, సమాజ నిర్మాణంలో గురువులదే ప్రధాన పాత్ర అని కొనియాడారు. ఈ గురు పూజోత్సవంలో పాల్గొనడం నా అదృష్టంగా భావిస్తాను అని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ కోట రాజ బాబు, ప్రథమిక సహకార సంఘం చైర్మన్ చల్లా తిరుపతయ్య, విశ్రాంత ఉద్యోగులు అడప రాజయ్య, విక్రమ్ సింగ్, కాంగ్రెస్ యూత్ నాయకులు కటకం అశోక్, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.