calender_icon.png 18 May, 2025 | 12:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే..

17-05-2025 07:19:56 PM

నిజాంసాగర్ (విజయక్రాంతి): బిచ్కుంద మండలం వాజీద్ నగర్ గ్రామానికి చెందిన అశోక్ పటేల్ మాతృమూర్తి అనారోగ్యంతో పరమపదించగా శనివారం రోజున జుక్కల్ మాజీ శాసనసభ్యులు హన్మంత్ షిండే వారి స్వగ్రామానికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి కుటుంబ సభ్యులను ఓదార్చారు. కార్యక్రమంలో బిచ్కుంద మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు వెంకట్ రావు దేశాయ్, వాజిత్ నగర్ అధ్యక్షులు సంతోష్, కథగావ్ మాజీ సర్పంచ్ హన్మాండ్లు, కల్లాలి మాజీ సర్పంచ్ సంజు పటేల్, నర్సింలు, మల్లు పటేల్, గంగా గౌడ్, సత్యనారాయణ, తోట హన్మాండ్లు, రాజు, సాయిలు, అంజయ్య తదితరులు పాల్గొన్నారు.