17-05-2025 07:16:00 PM
- స్థానిక సంస్థల ఎన్నికల్లో 12 శాతం రిజర్వేషన్ ఇవ్వాల్సిందే..
- కుల గణన చేసి కులాల వారిగా రిజర్వేషన్ ఎందుకు ప్రకటించలేదు..
- యాదవ విద్యావంతుల వేదిక రాష్ట్ర అధ్యక్షులు చలకాని వెంకట్ యాదవ్..
మహబూబ్ నగర్ (విజయక్రాంతి): రాజకీయ వర్గాలకు రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి బీసీలకు అన్యాయం చేయడం జరుగుతుందని, యాదవులంతా అసంతృప్తితో ఉన్నారని యాదవ విద్యావంతుల వేదిక రాష్ట్ర అధ్యక్షులు చలకాని వెంకట్ యాదవ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని టీఎన్జీవో భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కుల గణనను చేసినప్పటికీ ఏ కులం ఎంత మంది ఉన్నారనేది విజయాన్ని బహిర్గతం చేయకపోవడం సరికాదన్నారు. యాదవ్ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఏ కులం ఎంతమంది ఉన్నారని విషయాన్ని పూర్తిస్థాయిలో ప్రభుత్వం చెప్పాలని స్పష్టం చేశారు.
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కూడా కల్పించాలని కోరారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇచ్చి ఒకటి, రెండు కులాలకు మాత్రమే ప్రాథమిక ఇవ్వడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. 10 మంచి 12% యాదవులు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారని, ప్రతి కోటాలో న యాదవులకు 12 శాతం రిజర్వేషన్ కల్పించాలని కోరారు. దాదాపు రెండేళ్లు గడుస్తున్నప్పటికీ కేవలం యాదవులకు ఒకే ఒక్క రాజ్యసభ పదవి ఇచ్చి, సిఐఎస్ రిపోర్టు ప్రకారం యాదవులంతా 51 శాతం కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయడం జరిగిందని తెలిపారు. గత ప్రభుత్వం యాదవుల్లోను గొర్రెలు కాసుకుని బతకాలని చెప్పడంతో పూర్తిగా కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపిందని, కాంగ్రెస్ పార్టీ యాదవులకు సంవత్సర స్థానం కల్పించడం లేదని విమర్శించారు.
ప్రతి నియామకంలో యాదవులకు 12 చేత రిజర్వేషన్ కల్పించాలని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం జనగణలో భాగంగా పూర్తిస్థాయిలో కుల గణన చేసేందుకు చర్యలు తీసుకోవడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. 42 శాతం రిజర్వేషన్ నివేదిక ను కేంద్రానికి పంపించినప్పటికీ కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ ఆమోదం తెలిపి 9వ షెడ్యూల్లో చేర్చాల్సిన అవసరం ఉందని తెలిపారు. జనాభా తమాషా ప్రకారం రాజకీయ విద్య ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించిన రిజర్వేషన్లు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎవరి హక్కులు వాళ్ళు పొందలని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆనాడే చెప్పారని గుర్తు చేశారు. ఐక్యంగా ఉండి యాదవులు తమ హక్కులను సాధించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో యాదవ విద్యావంతుల వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బైకాని బాలు యాదవ్, జిల్లా అధ్యక్షులు అంజన్న యాదవ్, వర్కింగ్ ప్రెసిడెంట్ జుర్రు నారాయణ యాదవ్, నాయకులు కృష్ణ యాదవ్, వెంకట్ రాములు యాదవ్, రమేష్ యాదవ్ తదితరులు ఉన్నారు.