19-12-2025 12:00:00 AM
మహబూబాబాద్, డిసెంబర్ 18 విజయక్రాంతి: మహబూబాబాద్ జిల్లా కురవి మేజర్ పంచాయతీ సర్పంచ్ గా ఎన్నికైన బాదావత్ లక్ష్మీరాజు నాయక్ దంపతులను, వార్డు సభ్యులను గురువారం మహబూబాబాద్ జిల్లా బీఆర్‌ఎస్ అధ్యక్షురాలు, మాజీ ఎంపీ మాలోత్ కవిత సత్కరించారు. ప్రజల ఆశయా ల మేరకు గ్రామ అభివృద్ధికి కృషి చేయాలని,
అలా గే కురవి శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి దేవాలయ అభివృద్ధి, భక్తులకు సౌకర్యాల కల్పన కోసం పాటుపడాలని కవిత కోరారు. అధికార కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిపై సమిష్టి కృషితో విజయం సాధించడం పట్ల పార్టీ నాయకులను అభినందించారు. ఈ కార్యక్రమంలో బిఆర్‌ఎస్ నాయకులు కొనతం విజయ్, నరసింహారావు, భరత్ వర్మ, మల్లికార్జున్, శ్రీను, వినోద్, రవి, వీరన్న, ప్రశాంత్, కళ్యాణ్ పాల్గొన్నారు.